మగ బిడ్డకు జన్మనిచ్చిన మాజీ టెన్నిస్ తార షరపోవా.. చిన్నారి ఫొటో ఇదిగో!

  • రెండేళ్ల పాటు అలెగ్జాండర్ తో డేటింగ్ చేసిన షరపోవా
  • 2020లో ప్రియుడితో ఎంగేజ్ మెంట్ చేసుకున్న టెన్నిస్ తార
  • 2020లో ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైరయిన షరపోవా
ఆటతోనే కాకుండా అందంతో కూడా మరియా షరపోవా ఎన్నో ఏళ్ల పాటు టెన్నిస్ అభిమానులను అలరించింది. ఆటకు వీడ్కోలు పలికినా ఆమెపై ఫ్యాన్స్ కు ఉన్న అభిమానం మాత్రం చెక్కు చెదరలేదు. తాజాగా ఈ ప్రపంచ మాజీ నెంబర్ వన్ మగ బిడ్డకు జన్మనిచ్చింది. తనకు కొడుకు పుట్టినట్టు ఆమె ప్రకటించింది. తనకు కాబోయే భర్త అలెగ్జాండర్ గిల్క్స్ తో పాటు చిన్నారి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన కొడుక్కి వీరు థియోడర్ అని పేరు పెట్టుకున్నారు. 

అలెగ్జాండర్ తో రెండేళ్ల పాటు షరపోవా డేటింగ్ చేసింది. 2020లో వీరు ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. థియోడర్ ఈ ప్రపంచంలోకి రావడం తమ చిన్ని కుటుంబానికి ఒక రివార్డింగ్ గిఫ్ట్ అని షరపోవా తెలిపింది. కెరీర్ విషయానికి వస్తే గ్రాండ్ స్లామ్ సాధించిన అతి కొద్ది మందిలో షరపోవా ఒకరు. 2020లో ఆమె ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అయింది.

Maria Sharapova
Baby Boy
Tennis

More Telugu News